లారీల పంపిణీ… 500 మందికి ఉపాధి

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ వద్ద ‘స్టాండ్ ఆఫ్ ఇండియా’ పథకం కింద ఎస్టీ, ఎస్సీలకు మంజూరైన లారీలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు, ఎస్బీఐ సహకారంతో మహేంద్ర కంపెనీ ఆధ్వర్యంలో రూ.కోటి యాబై లక్షల పెట్టుబడితో ఓ యూనిట్‌ను స్థాపించామని […]

Update: 2020-08-31 09:46 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ వద్ద ‘స్టాండ్ ఆఫ్ ఇండియా’ పథకం కింద ఎస్టీ, ఎస్సీలకు మంజూరైన లారీలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు, ఎస్బీఐ సహకారంతో మహేంద్ర కంపెనీ ఆధ్వర్యంలో రూ.కోటి యాబై లక్షల పెట్టుబడితో ఓ యూనిట్‌ను స్థాపించామని తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ట్రాన్స్పోర్టు విభాగంలో ఉపాధి కల్పిస్తున్నామన్నారు. రూ.150 కోట్లతో ట్రాన్ష్పోర్టు విభాగంలో పెట్టుబడులు పెట్టి, సుమారు 500 మందికి ఉపాధికల్పిస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News