వారికి ఇబ్బంది ఉండొద్దు.. బెడ్లు సిద్ధం చేయండి: మల్లారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ఈఎస్ఐ హాస్పిటల్‌కు వచ్చే కార్మికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. ఈఎస్ఐసీ రీజినల్ బోర్డు ఏడో విడత సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన బుధవారం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. కొవిడ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కార్మికులకు సేవలందించేందుకు 50 పడకలను సిద్ధం చేయాలని ఈఎస్ఐసీ సనత్‌నగర్ డీన్‌ను ఆదేశించారు. నాచారంలో ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన గుర్తు […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఈఎస్ఐ హాస్పిటల్‌కు వచ్చే కార్మికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. ఈఎస్ఐసీ రీజినల్ బోర్డు ఏడో విడత సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన బుధవారం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. కొవిడ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కార్మికులకు సేవలందించేందుకు 50 పడకలను సిద్ధం చేయాలని ఈఎస్ఐసీ సనత్‌నగర్ డీన్‌ను ఆదేశించారు. నాచారంలో ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
ఈఎస్ఐసీకి అప్పగించిన సనత్‌నగర్ ఆస్పత్రిని ఒకలా.. నాచారం, రామచంద్రాపురం దవాఖాను మరోలా చూడటమేంటని మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సనత్‌నగర్‌లో పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ఈనెల 20 లేదా 22న బోర్డు సభ్యులు భాగస్వాములు కావాలని సూచించారు. అలాగే ఆస్పత్రిలో కావాల్సిన పరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపాలని సూపరింటెండెంట్లను ఆదేశించారు. నూతన డిస్పెన్సరీకి అవసరరమయ్యే స్టాఫ్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ఈఎస్ఐసీకి అనుసంధానం చేసిన హైదరాబాద్‌లోని 23 సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో కార్డియాలజీ, గ్యాస్ట్రో, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ, సర్జరీ, డయాలసిస్ వంటి చికిత్సలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలోని ఆస్పత్రుల్లో కూడా పలు చికిత్సలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారి రాణి కుముదిని, ఆర్డీ ఏకే.శర్మ, బోర్డు సభ్యులు హాజరయ్యారు.