నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు ‘ఆత్మనిర్భర్ భారత్’ నిధులు విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’నిధులు విడుదల చేసి ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పలు రంగాలను ఆదుకునేందుకు ప్రధాని రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో సహాయ ప్యాకేజీని ప్రకటించి ఏడాది గడిచినా నిధులు విడుదల చేయక పోవడంతో […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు ‘ఆత్మనిర్భర్ భారత్’ నిధులు విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’నిధులు విడుదల చేసి ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పలు రంగాలను ఆదుకునేందుకు ప్రధాని రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో సహాయ ప్యాకేజీని ప్రకటించి ఏడాది గడిచినా నిధులు విడుదల చేయక పోవడంతో పరిశ్రమల నిర్వహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. అతి త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుత ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజీని మరోసారి పునర్ నిర్వచించాలని సూచించారు. దీని ద్వారా ఈ కరోనా సంక్షోభంతో ప్రభావితమైన వివిధ రంగాలు, ముఖ్యంగా అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంఎస్ఎంఈ రంగానికి మరింత చేయూతనిచ్చే అవకాశం కలుగుతుందన్నారు. కేంద్రం ఈ దిశగా సరైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్రం పని చేస్తుందని తెలిపారు.