23న నీరా కేఫ్​కు శంకుస్థాపన

దిశ, న్యూస్​బ్యూరో: హైదరాబాద్​ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్​ కు ఈనెల 23న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన, సభ కార్యక్రమాల ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్​ గౌడ్​ బుధవారం పర్యవేక్షించారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం శ్రీనివాస్​ గౌడ్​ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి, కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపొందించామన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన […]

Update: 2020-07-22 10:52 GMT

దిశ, న్యూస్​బ్యూరో: హైదరాబాద్​ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్​ కు ఈనెల 23న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన, సభ కార్యక్రమాల ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్​ గౌడ్​ బుధవారం పర్యవేక్షించారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం శ్రీనివాస్​ గౌడ్​ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి, కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపొందించామన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా నీరా పాలసీని సీఎం ప్రవేశపెట్టారన్నారు. గౌడ్​ల ఆత్మగౌరవ భవనానికి కోకాపేటలో ఎంతో విలువైన 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. నీరా కేఫ్ కోస నెక్లెస్ రోడ్డులో ఎంతో విలువైన స్థలాన్ని కేటాయించినందుకు కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. ఐదారు నెలల్లో పూర్తి చేసి నీరా కేఫ్​ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News