ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఇప్పటి వరకు అనధికారిక లేఅవుట్లలో తెలియకుండానే ఫ్లాట్లను కొనుగోలుచేసిన వారు ఎల్ఆర్ఎస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం ఎల్ఆర్ఎస్ ఆన్లైన్, మీ సేవ సర్వీసులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రజలకు మేలుచేస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్‌కు సంబంధించిన అంశాలపై ప్రజా అవగాహన కోసం రూపొందించిన పోస్టర్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.