హెచ్ఎండీఏ నర్సరీని సందర్శించిన మంత్రి కేటీఆర్
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీని బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించి మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో పనిచేసే కార్మికులందరికీ ఈఫీఎఫ్, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ నర్సరీలో ఏఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఏవిధంగా పనిచేస్తారని హెచ్ఎండీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది భారీగా హరితహారాన్ని […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీని బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించి మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో పనిచేసే కార్మికులందరికీ ఈఫీఎఫ్, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ నర్సరీలో ఏఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఏవిధంగా పనిచేస్తారని హెచ్ఎండీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది భారీగా హరితహారాన్ని చేపట్టనున్నట్లు కేటీఆర్ వివరించారు. ప్రధానంగా మున్సిపాలిటీల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు మొక్కలు కావాల్సి వస్తే హెచ్ఎండీఏ నర్సరీలల్లో ఉచితంగా పంపిణీ చేయాలని కేటీఆర్ అన్నారు. మరో రెండు రోజుల్లో ప్రాంతాల వారీగా వివరాలను అందుబాటులో ఉంచుతామన్నారు.