సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష

దిశ, వెబ్ డెస్క్ : రానున్న ప‌ది రోజుల పాటు ప్ర‌తి ఎమ్మెల్యే వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోనే స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. హైద‌రాబాద్‎లో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‎లో మంగ‌ళ‌వారం ఉద‌యం నిర్వహించిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌ పాల్గొన్నారు. ఈ సంద్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ముంపునకు గురై కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఎమ్మెల్యేలు భరోసా […]

Update: 2020-10-20 01:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : రానున్న ప‌ది రోజుల పాటు ప్ర‌తి ఎమ్మెల్యే వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోనే స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. హైద‌రాబాద్‎లో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‎లో మంగ‌ళ‌వారం ఉద‌యం నిర్వహించిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌ పాల్గొన్నారు.

ఈ సంద్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ముంపునకు గురై కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఎమ్మెల్యేలు భరోసా కల్పించాలన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సీఎం ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన షెల్టర్ క్యాంపులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని తెలిపారు.

Tags:    

Similar News