హుజూరాబాద్‌‌లో ఈటల గెలుపు.. హరీష్‌ రావుకు కేటీఆర్ అభినందనలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలిచారు. ఓట్ల లెక్కింపు మొదలైన నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు స్పందించని క్రమంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో గెలిచేందుకు రాత్రింబవళ్లు కష్టపడిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. […]

Update: 2021-11-02 07:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలిచారు. ఓట్ల లెక్కింపు మొదలైన నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు స్పందించని క్రమంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో గెలిచేందుకు రాత్రింబవళ్లు కష్టపడిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హుజూ‌రాబాద్‌లో గెలుపు కోసం చాలా కష్టపడ్డారని, వారితో పాటు సోషల్ మీడియా వారియర్స్ అందరిని అభినందిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. గత 20 ఏళ్లలో టీఆర్‌ఎస్ ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిందని, ఈ ఒక్క ఓటమితో టీఆర్ఎస్‌కు నష్టం లేదన్నారు.

తెలంగాణలో బాగుపడింది వాళ్ల కుటుంబం మాత్రమే : వైయస్ షర్మిల

Tags:    

Similar News