కంగ్రాట్స్ ‘శీనన్న’.. మంత్రిపై ప్రశంసల వర్షం కురిపించిన కేటీఆర్

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రెండు స్థానాల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కుచుకుల్లా దామోదర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఎన్నికలు ఏకగ్రీవం కాగానే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం ఎమ్మెల్సీలతో కలిసి నేరుగా హైదరాబాద్‌లో […]

Update: 2021-11-25 08:34 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రెండు స్థానాల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కుచుకుల్లా దామోదర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఎన్నికలు ఏకగ్రీవం కాగానే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం ఎమ్మెల్సీలతో కలిసి నేరుగా హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలవడానికి బయలుదేరి వెళ్లారు.

విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఉత్సాహంగా బయటకు వచ్చి ఎన్నికలను ఏకగ్రీవం చేయడంలో ప్రధాన భూమికను పోషించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపిక కావడానికి పడిన కృషి గురించి మంత్రి కేటీఆర్‌కు వివరించారు. అనంతరం ఏకగ్రీవంగా ఎంపికైన ఎమ్మెల్సీలను మంత్రులు ఇరువురు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News