దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది :కేటీఆర్

దిశ, వెబ్‎డెస్క్: దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో గురువారం మంత్రి కేటీఆర్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాద్ లో కొన్ని చోట్లు అనిశ్చితి నెలకొందని తెలిపారు. హైదరాబాద్ పై ఎన్నో అసత్యప్రచారాలు చేశారన్నారు. ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ప్రచారం జరిగిందన్నారు. ఇక హైదరాబాద్ కు పెట్టుబడులే రావని.. తెలంగాణ వస్తే అంతా చీకటే అని పలువురు విమర్శించారని […]

Update: 2020-11-19 00:34 GMT

దిశ, వెబ్‎డెస్క్: దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో గురువారం మంత్రి కేటీఆర్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాద్ లో కొన్ని చోట్లు అనిశ్చితి నెలకొందని తెలిపారు. హైదరాబాద్ పై ఎన్నో అసత్యప్రచారాలు చేశారన్నారు. ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ప్రచారం జరిగిందన్నారు. ఇక హైదరాబాద్ కు పెట్టుబడులే రావని.. తెలంగాణ వస్తే అంతా చీకటే అని పలువురు విమర్శించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఆరేళ్ల క్రితం టీఆర్ఎస్ పై ఎన్నో దుష్ర్పచారాలు జరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రశాంతంగా ఉందంటే సీఎం కేసీఆర్ కారణమన్నారు. కేసీఆర్ మొదట నుంచి ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు.

Tags:    

Similar News