నేమ్ చేంజర్స్ కావాలా.. గేమ్ చేంజర్స్ కావాలా !: కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతల తీరుపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓట్ల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని, సర్జికల్ స్ట్రైక్ లాంటి వ్యాఖ్యలతో పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. నేమ్ చేంజర్స్ కావాలో గేమ్ చేంజర్స్ కావాలో ప్రజలు ఈ సందర్భంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వరద సాయంపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందన లేదని, ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక్క పనికూడా చేయలేదని […]

Update: 2020-11-27 08:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతల తీరుపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓట్ల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని, సర్జికల్ స్ట్రైక్ లాంటి వ్యాఖ్యలతో పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. నేమ్ చేంజర్స్ కావాలో గేమ్ చేంజర్స్ కావాలో ప్రజలు ఈ సందర్భంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వరద సాయంపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందన లేదని, ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక్క పనికూడా చేయలేదని ఆరోపించారు. కరోనా సమయంలో ప్రకటించిన రూ.20లక్షల కోట్లు ఏమయ్యాయో ఎవరికీ తెలియదని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2020 సదస్సులో పాల్గొన్న మంత్రి పేర్కొన్నారు.

ధరణిలో కోటి 55లక్షల ఎకరాల వ్యవసాయ భూమి నమోదు అయ్యిందన్న మంత్రి.. ధరణి రిజిస్ట్రేషన్లలో పారదర్శకత ఉంటుందన్నారు. డబ్బు ఖర్చు పెట్టడం మాత్రమే అభివృద్ధి కాదని, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలన్నారు. భూముల ధరలను అన్‌‌లాక్ చేయాల్సిన అవసరం ఉందని, త్వరలో డిజిటల్ సర్వే చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రజలపై భారం పడకుండా ఉండేందుకే ఆస్తుల క్రమబద్దీకరణ చేపడుతున్నామని, నిజమైన యజమానికి హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Tags:    

Similar News