మీ ఓటు ఇలా వేయండి.. ఎక్స్ అఫిషియో సభ్యులతో కేటీఆర్ భేటీ

దిశ,వెబ్‌డెస్క్:టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిపై తుది కసరత్తు మొదలైంది. బుధవారం కేటీఆర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ మేయర్ పేరును ఖరారు చేసేందుకు సమావేశమైన విషయం తెలిసిందే. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 99 సీట్లు దక్కించుకుని తిరుగులేని మెజార్టీతో మేయర్ పదవి దక్కించుకుంది టీఆర్ఎస్. అయితే ఈసారి కూడా టీఆర్ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం కష్టతరమైంది. దీంతో ఆశలన్నీ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటింగ్ పై టీఆర్ఎస్ అధిష్టానం ఆధారపడింది. దీంతో మరికొద్దిసేపట్లో గ్రేటర్ […]

Update: 2021-02-10 21:14 GMT

దిశ,వెబ్‌డెస్క్:టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిపై తుది కసరత్తు మొదలైంది. బుధవారం కేటీఆర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ మేయర్ పేరును ఖరారు చేసేందుకు సమావేశమైన విషయం తెలిసిందే. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 99 సీట్లు దక్కించుకుని తిరుగులేని మెజార్టీతో మేయర్ పదవి దక్కించుకుంది టీఆర్ఎస్. అయితే ఈసారి కూడా టీఆర్ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం కష్టతరమైంది. దీంతో ఆశలన్నీ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటింగ్ పై టీఆర్ఎస్ అధిష్టానం ఆధారపడింది. దీంతో మరికొద్దిసేపట్లో గ్రేటర్ ఎన్నికను పర్యవేక్షిస్తున్న కేటీఆర్, తలసాని, కేకేలు టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ లో ఓటు హక్కు వినియోగించుకోవడం పై నేతలు దిశానిర్ధేశం చేయనున్నారు. సమావేశం తర్వాత సభ్యులు బస్సులో జీహెచ్ఎంసీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. అనంతరం ఓటింగ్లో పాల్గొని మేయర్, డిప్యూటీ మేయర్లను ఖరారు చేయనున్నారు.

Tags:    

Similar News