‘ఐదురోజులకోసారి యాంటి లార్వా స్ర్పేయింగ్’

దిశ, న్యూస్‌బ్యూరో: సీజనల్ వ్యాధులను ఎదుర్కునేందుకు జీహెచ్ఎంసీ యుద్ధం ప్రకటిస్తోంది. ప్రస్తుతం నిర్వ‌హిస్తున్న శానిటేష‌న్, స్ర్పేయింగ్ కార్య‌క్ర‌మాల‌ను ఐదు రేట్లు పెంచాల‌ని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌తో క‌లిసి సోమవారం జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, ఎంట‌మాల‌జీ అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. జోన్లలో ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి స్థానిక శాస‌న స‌భ్యులు, కార్పొరేట‌ర్ల స‌హ‌కారంతో అద‌న‌పు ఫాగింగ్ మిష‌న్ల‌ను తెప్పించి ప్ర‌తి ఐదు రోజుల‌కు […]

Update: 2020-05-18 11:23 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: సీజనల్ వ్యాధులను ఎదుర్కునేందుకు జీహెచ్ఎంసీ యుద్ధం ప్రకటిస్తోంది. ప్రస్తుతం నిర్వ‌హిస్తున్న శానిటేష‌న్, స్ర్పేయింగ్ కార్య‌క్ర‌మాల‌ను ఐదు రేట్లు పెంచాల‌ని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌తో క‌లిసి సోమవారం జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, ఎంట‌మాల‌జీ అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. జోన్లలో ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి స్థానిక శాస‌న స‌భ్యులు, కార్పొరేట‌ర్ల స‌హ‌కారంతో అద‌న‌పు ఫాగింగ్ మిష‌న్ల‌ను తెప్పించి ప్ర‌తి ఐదు రోజుల‌కు ఒక‌సారి చొప్పున నెల‌కు ఐదు విడ‌త‌లు యాంటి లార్వా స్ప్రేయింగ్ చేయించాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు. హైరిస్క్ ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించి ఇంటెన్సీవ్ శానిటేష‌న్‌, యాంటి లార్వా స్ప్రేయింగ్ చేయాల‌ని తెలిపారు. ఈ నెల 19 నుంచి వారం పాటు కాల‌నీ/ అపార్ట్‌మెంట్‌ వెల్ఫేర్ అసోసియేష‌న్ల‌తో భౌతిక దూరం పాటిస్తూ స‌మావేశాలు నిర్వ‌హించి డెంగ్యూ, మ‌లేరియా, స్వైన్‌ప్లూ, చికెన్ గున్యా వ్యాధుల‌పై చైత‌న్య‌ప‌ర్చాల‌ని డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు. 54 ప్ర‌ధాన నాలాల్లో పూడిక‌ను తొల‌గించుట‌కు యంత్రాల‌ను వినియోగించాల‌ని తెలిపారు. చెరువులు, కుంట‌ల‌లో పెరిగిన గుర్ర‌పుడెక్క‌ను తొల‌గించుట‌కు ప్ర‌తిజోన్‌కు ఒక ఫ్లోటింగ్ ట్రాష్ క‌లెక్ట‌ర్ మిష‌న్‌ను కేటాయించ‌నున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతమున్న 123 బ‌స్తీ ద‌వాఖానాల‌కు అద‌నంగా మ‌రో 44 బ‌స్తీ ద‌వాఖానాల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ మాట్లాడుతూ.. గత రెండున్నర నెలలుగా వైద్య సిబ్బందితో కలిసి మునిసిపల్ సిబ్బంది, అధికారులు చాల గొప్పగా పనిచేశారని అభినందించారు. సీజ‌న‌ల్ వ్యాధుల‌ను అరిక‌ట్టేందుకు జీహెచ్‌ఎంసీ, మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్‌ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డిప్యూటీ మేయ‌ర్ మ‌హ్మ‌ద్ బాబా ఫ‌సియుద్దీన్‌, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, సెక్ర‌ట‌రీ సుద‌ర్శ‌న్ రెడ్డి, మెట్రోవాట‌ర్ వ‌ర్క్స్ ఎండీ దాన‌కిషోర్‌, ఈవీడీఎం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, అద‌న‌పు క‌మిష‌న‌ర్లు , జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏంటోమాలాజీ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News