అత్యాధునిక అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
దిశ, సికింద్రాబాద్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్, ఉప్పల ఫౌండేషన్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త తన ఫౌండేషన్ నుంచి అత్యాధునిక అంబులెన్సును విరాళంగా అందజేశారు. ఈ అంబులెన్స్ ను తార్నాకలోని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయం ఎదుట మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తన పిలుపుకు […]
దిశ, సికింద్రాబాద్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్, ఉప్పల ఫౌండేషన్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త తన ఫౌండేషన్ నుంచి అత్యాధునిక అంబులెన్సును విరాళంగా అందజేశారు. ఈ అంబులెన్స్ ను తార్నాకలోని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయం ఎదుట మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తన పిలుపుకు స్పందించి అంబులెన్స్ ను అందజేసినందుకు ఉప్పల శ్రీనివాస్ గుప్తను అభినందించారు. పేదలకు అండగా నిలిచేందుకు మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ… ఐసీయూ యూనిట్, వెంటిలేటర్ తో సహా అన్ని అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న అంబులెన్స్ ను రూ.25 లక్షలతో తయారు చేయించినట్లు చెప్పారు. ఇప్పటికే ఉప్పల ఫౌండేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్,కేటీఆర్ పిలుపు మేరకు రెండు లక్షల మందికి అన్నదానం చేశానని వివరించారు.