నేను ధరిస్తా.. నా ఫ్యామిలీ కూడా ధరించేలా చేస్తా : కేటీఆర్

దిశ, ఖైరతాబాద్: తెలంగాణ నేతన్నలు భారతీయ కళలకే వైభవాన్ని తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను కేటీఆర్ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 31 మంది ఉత్తమ నేతన్నలకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను, నగదును అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… జాతీయ చేనేత వస్త్రాలు కళానైపుణ్యానికి, వారసత్వ సంపదకు ప్రతీకలు, మన ఈ వారసత్వ […]

Update: 2021-08-07 08:12 GMT

దిశ, ఖైరతాబాద్: తెలంగాణ నేతన్నలు భారతీయ కళలకే వైభవాన్ని తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను కేటీఆర్ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 31 మంది ఉత్తమ నేతన్నలకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను, నగదును అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… జాతీయ చేనేత వస్త్రాలు కళానైపుణ్యానికి, వారసత్వ సంపదకు ప్రతీకలు, మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తామని కాపాడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు తాను చేనేత వస్త్రాలు ధరిస్తాని, నా కుటుంబ సభ్యులు బంధువులు కూడా ధరించే విధంగా కృషి చేస్తామని, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ చేయించారు. భారతీయ చేనేత కళానైపుణ్యానికి కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల కాటన్, నారాయణపేట చీరలు, కరీంనగర్ బెడ్షీట్లు, ఫర్నిచర్ తెలంగాణ కళా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి.

నైపుణ్యవంతులైన నేతన్నలను సన్మానించేందుకు ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారం రోజులపాటు ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 31 మంది నైపుణ్యం కలిగిన నేతన్నలకు అవార్డు చేయడంతో పాటు రూ.25 వేల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశామని అన్నారు. మనందరం మరిచిపోయిన పీతాంబరం ఆర్మూరు, తెలియజేయడానికి చీరలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని రాష్ట్రంలోని దేశంలోని ప్రజలందరికీ తెలియజేసేందుకు గోల్కొండ ద్వారా ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. నేటితరం పిల్లలను సైతం ఆకట్టుకునేందుకు నూతన డిజైన్‌లతో ముందుకు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈనాటి యువతకు అందజేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్ రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News