వాహనాల రద్దీ తగ్గించేందుకు లింక్ రోడ్లు :కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో రోడ్లపై వాహనాల రద్దీ తగ్గించేందుకు లింకు రోడ్లు దోహదపడతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 నుంచి పాత ముంబై రోడ్డు లెదర్ పార్క్ వరకు నిర్మించిన లింక్ రోడ్డును కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం వీయూసీ బ్రిడ్జి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో మొత్తం 137 లింక్ రోడ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. మొదటి దశలో 35 […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో రోడ్లపై వాహనాల రద్దీ తగ్గించేందుకు లింకు రోడ్లు దోహదపడతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 నుంచి పాత ముంబై రోడ్డు లెదర్ పార్క్ వరకు నిర్మించిన లింక్ రోడ్డును కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం వీయూసీ బ్రిడ్జి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో మొత్తం 137 లింక్ రోడ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. మొదటి దశలో 35 లింక్ రోడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం రూ. 313.65 కోట్లు మంజూరు చేశామన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని తెలిపారు. ఆకర్షణీయ నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుందన్నారు. మౌలిక వసతులను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రుల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
MP @DrRanjithReddy, MLC @naveenktrs, MLAs @GandhiArekapudi and @DNRTRS and Mayor @bonthurammohan were present.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 9, 2020