పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచాం :కేటీఆర్

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‎లో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే కాంప్యాక్టర్ వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గురువారం ఉదయం నెక్లెస్ రోడ్డులో వద్ద కాంప్యాక్టర్ స్వచ్ఛ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే హైదరాబాద్‌ ఆదర్శంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచామని తెలిపారు. ప్రస్తుతం రెండు వేల స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ జరుగుతోందని, త్వరలోనే మరో 2,700 […]

Update: 2020-11-12 01:10 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‎లో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే కాంప్యాక్టర్ వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గురువారం ఉదయం నెక్లెస్ రోడ్డులో వద్ద కాంప్యాక్టర్ స్వచ్ఛ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే హైదరాబాద్‌ ఆదర్శంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచామని తెలిపారు. ప్రస్తుతం రెండు వేల స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ జరుగుతోందని, త్వరలోనే మరో 2,700 ఆధునిక చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News