ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇష్యూ.. కేటీఆర్‌కు ఈ-కామర్స్ ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. నగర వ్యాప్తంగా శనివారం భారీగా తనిఖీలు నిర్వహించారు. రోడ్డుమీదకు వచ్చిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే వాహనదారులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో పలుచోట్ల ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ను పోలీసులు పలుచోట్ల అనుమతించలేదు. వారికి అనుమతి ఉన్నా.. పలుచోట్ల పోలీసులు నిరాకరించారు. దీంతో విషయం తెలిసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. జొమాటో, స్వి్గ్గీలకు చెందిన ఫుడ్ డెలివరీ […]

Update: 2021-05-22 23:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. నగర వ్యాప్తంగా శనివారం భారీగా తనిఖీలు నిర్వహించారు. రోడ్డుమీదకు వచ్చిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే వాహనదారులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో పలుచోట్ల ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ను పోలీసులు పలుచోట్ల అనుమతించలేదు. వారికి అనుమతి ఉన్నా.. పలుచోట్ల పోలీసులు నిరాకరించారు. దీంతో విషయం తెలిసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. జొమాటో, స్వి్గ్గీలకు చెందిన ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను అడ్డుకున్న విషయం తెలిసి, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. దీంతో ఈ-కామర్స్ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌కి అనుమతి ఉందని, వారిని ఇబ్బందులకు గురిచేయొద్దని పోలీసులకు సూచించారు.

Tags:    

Similar News