మేయర్ పీఠంపై కేటీఆర్ సమాధానం ఇదే..!

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. చాలా డివిజన్లలో రెండు, మూడు వందల ఓట్లు, పదుల సంఖ్యల తేడాతోనే ఓడిపోయామని గుర్తు చేశారు. మరో 25 స్థానాలు వస్తాయని ఆశించినప్పటికీ రాలేదన్నారు. అయినా నిరాశ పడాల్సిన అవసరం లేదని కేటీఆర్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. ముఖ్యంగా గ్రేటర్‌లో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన […]

Update: 2020-12-04 09:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. చాలా డివిజన్లలో రెండు, మూడు వందల ఓట్లు, పదుల సంఖ్యల తేడాతోనే ఓడిపోయామని గుర్తు చేశారు. మరో 25 స్థానాలు వస్తాయని ఆశించినప్పటికీ రాలేదన్నారు. అయినా నిరాశ పడాల్సిన అవసరం లేదని కేటీఆర్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. ముఖ్యంగా గ్రేటర్‌లో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించిన నగర ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇక మేయర్ సీట్‌పై స్పందించిన ఆయన ఇంకా రెండు నెలలు సమయం ఉందని చెప్పి ప్రెస్ మీట్ ముగించారు.

Tags:    

Similar News