దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ మూలస్తంభం !

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ మూలస్తంభంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రానికి వెళ్లిన పన్నులపై ఆదివారం ట్విట్టర్‌లో కేటీఆర్ వివరణ ఇచ్చారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1,40,329 కోట్లు వస్తే, 2014 నుంచి 2020 వరకు తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2,72,926 కోట్లు వెళ్లాయని స్పష్టం చేశారు. 2014-20లో దేశ తలసరి ఆదాయం 54.9శాతం పెరిగితే, తెలంగాణలో తలసరి ఆదాయం 83.9శాతం పెరిగిందని తెలిపారు. రుణాలు, జీఎస్‌డీపీ రేషియో తక్కువ ఉన్న 5రాష్ట్రాల్లో […]

Update: 2020-11-01 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ మూలస్తంభంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రానికి వెళ్లిన పన్నులపై ఆదివారం ట్విట్టర్‌లో కేటీఆర్ వివరణ ఇచ్చారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1,40,329 కోట్లు వస్తే, 2014 నుంచి 2020 వరకు తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2,72,926 కోట్లు వెళ్లాయని స్పష్టం చేశారు. 2014-20లో దేశ తలసరి ఆదాయం 54.9శాతం పెరిగితే, తెలంగాణలో తలసరి ఆదాయం 83.9శాతం పెరిగిందని తెలిపారు. రుణాలు, జీఎస్‌డీపీ రేషియో తక్కువ ఉన్న 5రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని వెల్లడించారు.

Tags:    

Similar News