కంటైన్‌మెంట్ జోన్లలో మంత్రి పర్యటన

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయడం లేదంటూ ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని కంటైన్‌మెంట్ జోన్లలో మంత్రి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చాయనీ, రైతులు చాలా […]

Update: 2020-05-02 03:41 GMT

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయడం లేదంటూ ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని కంటైన్‌మెంట్ జోన్లలో మంత్రి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చాయనీ, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. వచ్చే వానకాలం పంటలకూ ఎరువులు, విత్తనాలను ముందస్తుగానే అందిస్తున్నామని చెప్పారు. వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్తామంటే.. సురక్షితంగా పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Tags: minister jagadish reddy, containment zones, visit, nallagonda

Tags:    

Similar News