వాళ్లు ఏనాడూ తెలంగాణ కోసం కొట్లాడలేదు: మంత్రి జగదీష్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ లిఫ్ట్‌పై ఏపీ ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు తెలిపామని, తమ సూచనలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, రాయలసీమ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలయజ్ఙం పేరుతో తెలంగాణ జలాలను ఏపీ దోపిడీ చేసిందని, దానికి తెలంగాణ కాంగ్రెస్ […]
దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ లిఫ్ట్‌పై ఏపీ ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు తెలిపామని, తమ సూచనలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, రాయలసీమ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలయజ్ఙం పేరుతో తెలంగాణ జలాలను ఏపీ దోపిడీ చేసిందని, దానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం వంత పాడారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను దోచుకునే విషయంలో ఆంధ్రా నేతలందరూ ఒక్కటే అని అన్నారు. చట్టం రాజ్యాంగం ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తోందని తెలిపారు. జాతీయ పార్టీలు ఏనాడూ తెలంగాణ కోసం కొట్లాడలేదు అని వెల్లడించారు.