సూర్యాపేట మాదిరిగా మునుగోడు.. హామీ ఇచ్చిన మంత్రి
దిశ, చండూరు: సూర్యాపేట మాదిరిగా మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నాంపల్లి, మర్రిగూడ మండలాల్లోని లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 ముందు తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని.. స్వరాష్ట్రం ఏర్పాటుతో […]
దిశ, చండూరు: సూర్యాపేట మాదిరిగా మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నాంపల్లి, మర్రిగూడ మండలాల్లోని లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 ముందు తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని.. స్వరాష్ట్రం ఏర్పాటుతో కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందుతుందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట మాదిరిగా మునుగోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు
200 మంది పోలీసులతో బందోబస్తు
ఆహార భద్రత కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు ఆటంకం సృష్టిస్తారన్న ఉద్దేశంతో దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.