త్వరగా పంపండి.. హెల్త్ డైరెక్టర్‌కు మినిస్టర్ ఆర్డర్స్

దిశ, సూర్యాపేట: కోవాక్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లను వెంటనే సెండ్ చేయాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు మినిస్టర్ జగదీష్ రెడ్డి ఆర్డర్స్ పాస్ చేశారు. ఉన్న ఫలంగా టెస్ట్ కిట్లను పెంచడంతో పాటు త్వరగా జిల్లా ఆస్పత్రికి పంపించాలన్నారు. సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో బుధవారం రెండో టీకా తీసుకున్న ఆయన.. అనంతరం అదే ఆసుపత్రిలో కొవిడ్ బాధితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరామర్శించారు. ఇదే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డియంహెచ్ఓలతో ఫోన్‌లోనే సమీక్షించారు. టెస్ట్ […]

Update: 2021-04-28 07:35 GMT

దిశ, సూర్యాపేట: కోవాక్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లను వెంటనే సెండ్ చేయాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు మినిస్టర్ జగదీష్ రెడ్డి ఆర్డర్స్ పాస్ చేశారు. ఉన్న ఫలంగా టెస్ట్ కిట్లను పెంచడంతో పాటు త్వరగా జిల్లా ఆస్పత్రికి పంపించాలన్నారు. సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో బుధవారం రెండో టీకా తీసుకున్న ఆయన.. అనంతరం అదే ఆసుపత్రిలో కొవిడ్ బాధితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరామర్శించారు. ఇదే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డియంహెచ్ఓలతో ఫోన్‌లోనే సమీక్షించారు. టెస్ట్ కిట్లు, వ్యాక్సిన్‌ల కొరత ఉందని అధికారులు వెల్లడించగా.. వెంటనే హెల్త్ డైరెక్టర్‌కు కాల్ చేసి టెస్టులు, వ్యాక్సినేషన్ పెంచేందుకు అన్ని రకాల మెడికల్ ఎక్విప్‌మెంట్ పంపాలని ఆదేశించారు. అటు హెటిరో ఎండీతో కూడా మాట్లాడి రెమిడెసివర్‌ను కూడా అందుబాటులో ఉంచాలన్నారు.

Tags:    

Similar News