కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి: జగదీశ్‌రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మారిస్తే.. కేంద్రం రైతుల జేబులకు చిల్లులు పెడుతుందని ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర చట్టాలతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉందన్న మంత్రి జగదీశ్‌రెడ్డి.. రైతులను చంపేసే చట్టాలను ప్రధాని మోడీ అమలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులు […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మారిస్తే.. కేంద్రం రైతుల జేబులకు చిల్లులు పెడుతుందని ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర చట్టాలతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉందన్న మంత్రి జగదీశ్‌రెడ్డి.. రైతులను చంపేసే చట్టాలను ప్రధాని మోడీ అమలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పడే లాభాల్లోకి వస్తున్నారని పేర్కొన్నారు.