వారి అబద్ధాలకు ‘ఆచార్య’ వత్తాసు పలకడమా..
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యులేనని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వారి సహకారంతోటే సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు సత్ఫాలితాలు ఇస్తున్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. అటువంటి ఉద్యోగులు మండలి ఎన్నికల్లో నూటికి నూరుశాతం టీఆర్‌ఎస్‌నే బలపరుస్తున్నారని ఇందులో ఎలాంటి సందేహాం లేదని అన్నారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నకిరేకల్ […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యులేనని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వారి సహకారంతోటే సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు సత్ఫాలితాలు ఇస్తున్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. అటువంటి ఉద్యోగులు మండలి ఎన్నికల్లో నూటికి నూరుశాతం టీఆర్‌ఎస్‌నే బలపరుస్తున్నారని ఇందులో ఎలాంటి సందేహాం లేదని అన్నారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఆడుతున్న అబద్ధాలకు ఆచార్య కోదండరామ్ వత్తాసు పలకడం విడ్డురంగా ఉందన్నారు.
మోడీ పాలన రాక్షసత్వాన్నీ మరిపిస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ పాలనలో సామాన్యులకు ఆదాయం తగ్గిందని అదే సమయంలో అంబానీ, ఆదానీల ఆదాయం మాత్రం రెట్టింపు అయిందంటూ దెప్పి పొడిచారు. 700 శాతం ఆదాయం ఆదానిది పెరిగితే.. అంబానీది 370 శాతానికి పెరగడమే అందుకు నిదర్శనమన్నారు. వంటగ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నా బీజేపీ పాలకుల్లో చలనం లేదని దుయ్యబట్టారు. డీజిల్, పెట్రోల్ ధరలు అందనంత దూరం పోతుండడంతో సామాన్యులు కుదేలు అవుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఎవరెన్ని చెప్పినా పట్టబద్రులు పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటే ఉన్నారని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మె్ల్యే చిరుమర్తి లింగయ్య, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.