వ‌ర్ధ‌మానుకోటను సందర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి

దిశ, న‌ల్ల‌గొండ‌ : నల్గొండ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలో 6 గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన వారిగా గుర్తించారు. దీంతో ఆ గ్రామాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. వర్ధమాను కోట ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పేదలకు అవసరమయ్యే నిత్యావసరాలైన బియ్యం, పప్పులు, మందులను ప్రతి ఇంటికి పంపిణీ చేయాలన్నారు.గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన […]

Update: 2020-04-07 04:08 GMT

దిశ, న‌ల్ల‌గొండ‌ : నల్గొండ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలో 6 గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన వారిగా గుర్తించారు. దీంతో ఆ గ్రామాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. వర్ధమాను కోట ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పేదలకు అవసరమయ్యే నిత్యావసరాలైన బియ్యం, పప్పులు, మందులను ప్రతి ఇంటికి పంపిణీ చేయాలన్నారు.గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, పాజిటివ్ లక్షణాలు కనిపించిన అందరిని ప్రభుత్వం గుర్తించి చికిత్స అందజేస్తున్నదని వివరించారు.గ్రామంలో అనవసర భయాందోళనలు రేకెత్తించేలా పుకార్లు సృష్టించవద్దని కోరారు. అనుక్షణం వైద్య సిబ్బంది, అధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, క‌లెక్ట‌ర్‌ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ ఆర్‌ భాస్కరన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags: carona, lockdown, minister jagadeesh, visit vardamanukota

Tags:    

Similar News