సోలిపేట లేకపోవడం బాధాకరం
దిశ, దుబ్బాక: తెలంగాణ ఉద్యమంలో 2004 సంవత్సరం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి రాష్ట్ర సాధనకై అహర్నిశలు కృషి చేసిన సోలిపేట రామలింగారెడ్డి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని మంత్రి ఇంద్రాకరణ్ రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దివంగత నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని శనివారం ఇంద్రకరన్ రెడ్డి పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రామలింగారెడ్డి […]
దిశ, దుబ్బాక: తెలంగాణ ఉద్యమంలో 2004 సంవత్సరం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి రాష్ట్ర సాధనకై అహర్నిశలు కృషి చేసిన సోలిపేట రామలింగారెడ్డి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని మంత్రి ఇంద్రాకరణ్ రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దివంగత నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని శనివారం ఇంద్రకరన్ రెడ్డి పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రామలింగారెడ్డి గత పదిహేను రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం మమ్మల్ని అందరినీ కలచివేసిందన్నారు. దుబ్బాక నియోజకవర్గం కోసం అహర్నిశలు కృషి చేసి, ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సేవలందించి ఎమ్మెల్యేగా ఉంటూనే హఠాన్మరనం పొందడం దురదృష్టకరమని అన్నారు. ఆయన మాతో కూడా ఎన్నో సార్లు ఈ ప్రాంతం గురించి ప్రస్తావించేవారని గుర్తు చేశారు. ఆయన అకాల మరణం ఇక్కడి ప్రాంతానికే కాదు తెలంగాణ రాష్ట్రానికి, మాకు అందరికీ తీరని లోటన్నారు.