రెవె‘న్యూ’ చట్టం సీఎం కేసీఆర్ స్వప్నం..

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం సీఎం కేసీఆర్ స్వప్నమని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దీనిపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారని వివరించారు. ఈ చట్టం ద్వారా భూవివాదాలకు చెక్ పెట్టవచ్చునని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యుత్ బిల్లుపై మంత్రి ఘాటుగా స్పందించారు. రైతులను నట్టేట ముంచేందుకే ఈ బిల్లు తీసుకొచ్చారని.. దీనిని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. అదే విధంగా రైతు వ్యతిరేక బిల్లులను కూడా […]

Update: 2020-09-20 06:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం సీఎం కేసీఆర్ స్వప్నమని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దీనిపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారని వివరించారు. ఈ చట్టం ద్వారా భూవివాదాలకు చెక్ పెట్టవచ్చునని ఆశాభావం వ్యక్తంచేశారు.

అనంతరం కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యుత్ బిల్లుపై మంత్రి ఘాటుగా స్పందించారు. రైతులను నట్టేట ముంచేందుకే ఈ బిల్లు తీసుకొచ్చారని.. దీనిని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. అదే విధంగా రైతు వ్యతిరేక బిల్లులను కూడా కేంద్రం ఉపసంహరించుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News