మట్టి గణపతులను ప్రతిష్టిద్దాం : మంత్రి

దిశ, నిర్మల్: స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర‌వారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రజలకు మట్టి గ‌ణ‌ప‌తి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఒక‌ ల‌క్ష మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌ను అంద‌జేస్తున్నామ‌న్నారు. పర్యావరణానికి […]

Update: 2020-08-21 08:52 GMT

దిశ, నిర్మల్: స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర‌వారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రజలకు మట్టి గ‌ణ‌ప‌తి విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఒక‌ ల‌క్ష మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌ను అంద‌జేస్తున్నామ‌న్నారు. పర్యావరణానికి హానీ కలగకుండా మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలను కోరారు.

Tags:    

Similar News