యోగా నిరంతర సాధనతో సంపూర్ణ ఆరోగ్యం: మంత్రి హరీష్
దిశ, సిద్దిపేట: యోగ నిరంతర సాధనతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట విద్యాశాఖ ఆధ్వర్యంలో వినూత్నంగా ఉపాధ్యాయులకు కరోనా సమయంలో ప్రాణాయామం, ధ్యానం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచుకోవడం కోసం సిద్దిపేట జిల్లా యోగ అసోసియేషన్ సహకారంతో అన్ లైన్‌లో యూట్యూబ్ ఛానల్ ద్వారా శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతుల సందర్భంగా ఉపాధ్యాయుల ఉద్దేశించి ఆన్ లైన్ ద్వారా మంత్రి మాట్లాడారు. ప్రస్తుత కరోనా విలయ తాండవం తరుణంలో […]
దిశ, సిద్దిపేట: యోగ నిరంతర సాధనతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట విద్యాశాఖ ఆధ్వర్యంలో వినూత్నంగా ఉపాధ్యాయులకు కరోనా సమయంలో ప్రాణాయామం, ధ్యానం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచుకోవడం కోసం సిద్దిపేట జిల్లా యోగ అసోసియేషన్ సహకారంతో అన్ లైన్‌లో యూట్యూబ్ ఛానల్ ద్వారా శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతుల సందర్భంగా ఉపాధ్యాయుల ఉద్దేశించి ఆన్ లైన్ ద్వారా మంత్రి మాట్లాడారు. ప్రస్తుత కరోనా విలయ తాండవం తరుణంలో ఉపాధ్యాయులకు యోగ శిక్షణ తరగతులు విద్యాశాఖ రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు యోగ చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా ఎదుర్కోవచ్చని అన్నారు.
శరీరంలోని అంతర్భాగాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని యోగాసనాల ద్వారా పొందవచ్చన్నారు. కరోనా ప్రధానంగా శ్వాస ప్రక్రియపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, ఈ సమయంలో యోగా ద్వారా శ్వాస ప్రక్రియను మెరుగుపరుచుకుంటే కరోనాను జయించవచ్చని తెలిపారు. కరోనా వింత పోకడలతో విజృంభిస్తుందని, దీని ద్వారా ఎంతో మంది చనిపోతున్నారని అన్నారు. ప్రపంచంమంతా ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకు మనమంతా కేవలం గంటసేపు మన ఆరోగ్యం కోసం కేటాయించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందాలని సూచించారు. దీని కోసం మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, కేవలం సమయాన్ని కేటాయించడం అన్నారు. నిత్యకృత్యంగా దీన్ని ఆచరిస్తే ఎలాంటి వ్యాధులు రాకుండా రక్షణ కల్పించి ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవితాన్ని ఇస్తుందన్నారు.
సిద్దిపేట జిల్లా విద్యాధికారి డాక్టర్ రవి కాంతారావు మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపు రెండు వేల మంది ఈ కార్యక్రమం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు అందరూ పాల్గొనవచ్చన్నారు. https://youtu.be/qk1-YmwQZaE YouTube live ద్వారా హాజరు కావచ్చన్నారు. ఒకవేళ లైవ్ లో హాజరు కాలేని వాళ్లు Siddipet Vidya Mithra YouTube channel లో చూడవచ్చన్నారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఈ నెల 19వ తేదీ వరకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి డాక్టర్ రమేష్, తదితరులు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా యోగ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొమరవెల్లి అంజయ్య, అధ్యక్షులు తోట అశోక్ , ప్రధాన కార్యదర్శి నిమ్మ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.