సీఎం కేసీఆర్ కీలక సమావేశానికి మంత్రి హరీష్ డుమ్మా
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి హరీష్ రావు హాజరుకాలేదు. మధ్యాహ్నం వరకు ప్రగతి భవన్ లో ఉన్న ఆయన సమావేశానికి రాకపోవడం చర్చనీయాశంగా మారింది. మంత్రిని పార్టీకి దూరం చేశారా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేది హాట్ టాపిక్ గా మారింది. కార్పొరేషన్ చైర్మన్లుగా ఎన్నికైన వారితో ఉన్న హరీష్ రావు.. సడన్ గా పని ఉందని చెప్పి కేసీఆర్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి హరీష్ రావు హాజరుకాలేదు. మధ్యాహ్నం వరకు ప్రగతి భవన్ లో ఉన్న ఆయన సమావేశానికి రాకపోవడం చర్చనీయాశంగా మారింది. మంత్రిని పార్టీకి దూరం చేశారా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేది హాట్ టాపిక్ గా మారింది. కార్పొరేషన్ చైర్మన్లుగా ఎన్నికైన వారితో ఉన్న హరీష్ రావు.. సడన్ గా పని ఉందని చెప్పి కేసీఆర్ అనుమతితో హాజరుకాలేదని సమాచారం. అయినప్పటికీ అసలు ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది.