అయ్యా నమస్తే.. రాజవ్వ ఎట్లున్నవ్
దిశ, మెదక్: మత్స్యకారులకు చేపల దిగుబడిని పెంచేందుకు జిల్లాలో నూతనంగా కేజ్ కల్చర్‌లో చేపలను పెంచాలని మంత్రి తన్నీరు హరీశ్ రావు సూచించారు. గురువారం ఉదయం సుడా కార్యాలయంలో జిల్లా మత్స్య శాఖ అధికారి వెంకయ్య ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజక పరిధిలోని మత్స్యసహకార సంఘాలైన గుర్రాలగొంది, రాఘవాపూర్, నారాయణరావుపేట, రాజగోపాల్ పేట, ఎన్సాన్ పల్లి, సిద్దిపేట గ్రామాల పరిధిలో గల చెరువులలో కేజ్ కల్చర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి పారుదల, మత్స్యశాఖ అధికారులను […]
దిశ, మెదక్: మత్స్యకారులకు చేపల దిగుబడిని పెంచేందుకు జిల్లాలో నూతనంగా కేజ్ కల్చర్‌లో చేపలను పెంచాలని మంత్రి తన్నీరు హరీశ్ రావు సూచించారు. గురువారం ఉదయం సుడా కార్యాలయంలో జిల్లా మత్స్య శాఖ అధికారి వెంకయ్య ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజక పరిధిలోని మత్స్యసహకార సంఘాలైన గుర్రాలగొంది, రాఘవాపూర్, నారాయణరావుపేట, రాజగోపాల్ పేట, ఎన్సాన్ పల్లి, సిద్దిపేట గ్రామాల పరిధిలో గల చెరువులలో కేజ్ కల్చర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి పారుదల, మత్స్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌ను సందర్శించి అవగాహన పెంపొందించుకోవాలని సంబంధిత మత్స్యకారులను, గ్రామాల సర్పంచులను ఆదేశించారు.
అంతకముందు సిద్ధిపేట పట్టణంలో పర్యటించిన మంత్రి హరీశ్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సందర్భంగా పట్టణంలోని 6వ వార్డులో పర్యటిస్తున్న క్రమంలో అక్కడే ఉన్న వృద్ధురాలు అయ్యా నమస్తే అని మంత్రిని పలకరించగా నమస్తే అవ్వ అని అమెతో ముచ్చటించారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ‘‘ఎం రాజవ్వ ఎట్లున్నవ్.. పాణం మంచిగుందా.. పింఛన్ వస్తుందా.. ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా.. ఎట్లున్నావ్ అవ్వ… ఆరోగ్యం బాగుందా.. కొడుకులు ఏడున్నారు.. మంచిగా అరుసుకుంటున్నారా… అంటూ ఆప్యాయంగా ముచ్చటించాడు. మంత్రి ముచ్చటకు ఆవ్వ నవ్వుతూ.. ఫించన్ వత్తాంది సార్.. నా ప్రాణం నిలిబెట్టినవ్ నువ్వే నా పెద్దకొడుకువు సారూ అంటూ’’ నీ దయ వాళ్ళ మంచిగున్న సార్ అని దండం పెట్టి… నువ్ సల్లగా ఉండాలని అవ్వ మంత్రికి దీవెనలు అందించింది.