డాక్టర్ మృతిపట్ల మంత్రి హరీష్ సంతాపం..
దిశ, సిద్దిపేట: సిద్దిపేటకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ శంకర్ రావు మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకర్ రావు పేద ప్రజలకు వైద్యం అందించడమే కాకుండా, తన వృత్తినే సామాజిక సేవగా భావిస్తూ వైద్య సేవలు అందించే వారన్నారు. సిద్దిపేట IMA అధ్యక్షునిగా, సీనియర్ వైద్యునిగా సిద్దిపేట ప్రజలకు వైద్య సేవలతో పాటు, మెడికల్ అసోసియేషన్‌కు ఎంతో సేవ చేశారని కొనియాడారు. అయితే, డాక్టర్ శంకర్ రావు […]
దిశ, సిద్దిపేట: సిద్దిపేటకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ శంకర్ రావు మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకర్ రావు పేద ప్రజలకు వైద్యం అందించడమే కాకుండా, తన వృత్తినే సామాజిక సేవగా భావిస్తూ వైద్య సేవలు అందించే వారన్నారు. సిద్దిపేట IMA అధ్యక్షునిగా, సీనియర్ వైద్యునిగా సిద్దిపేట ప్రజలకు వైద్య సేవలతో పాటు, మెడికల్ అసోసియేషన్‌కు ఎంతో సేవ చేశారని కొనియాడారు.
అయితే, డాక్టర్ శంకర్ రావు కరోనా బారిన పడి, చికిత్స పొందుతూ మృతిచెందటం బాధాకరమైన విషయమని మంత్రి వివరించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించినప్పటికీ బతికించుకోలేక పోయామని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.