‘వాళ్లు మళ్లీ తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారు.. జాగ్రత్తగా ఉండాలే’

దిశ, పటాన్‌చెరు: కాంగ్రెస్ ముసుగులో ఆంధ్రా తొత్తులు తెలంగాణలోకి మళ్లీ ప్రవేశించాలని చూస్తున్నారని, తెలంగాణ ప్రజానీకం జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీష్ రావు సూచించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సదాశివపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు గ్రామాల సర్పంచులతో పాటు సదాశివపేట ఎంపీపీ తొంట యాదమ్మ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి హరీష్ […]

Update: 2021-07-10 09:59 GMT

దిశ, పటాన్‌చెరు: కాంగ్రెస్ ముసుగులో ఆంధ్రా తొత్తులు తెలంగాణలోకి మళ్లీ ప్రవేశించాలని చూస్తున్నారని, తెలంగాణ ప్రజానీకం జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీష్ రావు సూచించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సదాశివపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు గ్రామాల సర్పంచులతో పాటు సదాశివపేట ఎంపీపీ తొంట యాదమ్మ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి హరీష్ రావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నాడు తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను సిగరెట్, బీడీలతో పోల్చిన నాయకుల వారసులు తెలంగాణలో కొత్త పార్టీలతో హల్చల్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో నాటి సమైక్య వాదుల తొత్తులు తెలంగాణలో అధికారం కోసం వస్తున్నారని వారు కంటున్న పగటి కలలు వమ్ము అవుతాయన్నారు. కాంగ్రెసోళ్లు గాంధీభవన్ ఎక్కువ, ప్రజల్లో తక్కువ అన్నారు. 70 ఏళ్ళలో కాంగ్రెస్ చేయని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లలో చేసి చూపిందన్నారు. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ వెతికినా కనిపించవన్నారు. తెలంగాణ కోసం పోరాడింది, సాధించింది టీఆర్ఎస్ మాత్రమేనని తెలంగాణ సమాజానికి తెలుసన్నారు.

ఇది పౌరుషాల గడ్డ, త్యాగాలతో సాధించిన గడ్డ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనల్ని అవహేళన చేసి రాష్ట్రం రానే రాదని అడ్డుపడ్డ వారికి వారసులం అంటే ఒప్పుకోవాలా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని పొత్తు పెట్టుకొని ఐదేళ్లు కాలయాపన చేసింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా? అని మంత్రి ప్రశ్నించారు. అలాంటి వారికి తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థానం లేదన్నారు. కొత్తగా వచ్చే వారిని ప్రజలు నమ్మరన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లక్షా 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో అన్ని శాఖల్లో మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. రూపాయలు 4 వేల కోట్లతో రాష్ట్రంలో పాఠశాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్)లో పరిశ్రమలు వచ్చి ఉమ్మడి జిల్లా వాసులకు ఉపాధి మెరుగుపడుతుందని అన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.

Tags:    

Similar News