సీఎం పర్యటనపై సమీక్ష

దిశ, మెదక్: ఈనెల 29న కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్ననేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి కలెక్టర్ వెంకట్రామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్ పాల్గొన్నారు. కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం, 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ పోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు […]

Update: 2020-05-26 06:31 GMT

దిశ, మెదక్: ఈనెల 29న కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్ననేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి కలెక్టర్ వెంకట్రామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్ పాల్గొన్నారు. కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం, 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ పోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తోక్కనున్నాయని హరీశ్‌రావు తెలిపారు.

Tags:    

Similar News