తల్లి బాధను వర్ణిస్తూ వాట్సాప్ సందేశం: స్పందించిన హరీశ్‌రావు

దిశ, మెదక్: తన తల్లి పడుతున్న బాధను చూసి తట్టుకోలేక ఓ కుమారుడు మంత్రి హరీశ్ రావు‌కు వాట్సాప్ సందేశం పంపాడు. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నంట యాదిరెడ్డి తల్లి పద్మ గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతోంది. అసలే పేదరికం పైగా లాక్‌డౌన్.. ఈ క్రమంలో తల్లి పడుతున్న బాధను వివరిస్తూ తమను ఆదుకోవాలంటూ మంత్రి హరీశ్‌రావుకు వాట్సాప్ సందేశాన్ని పంపాడు. స్పందించిన మంత్రి.. అమ్మకు […]

Update: 2020-05-10 01:12 GMT

దిశ, మెదక్: తన తల్లి పడుతున్న బాధను చూసి తట్టుకోలేక ఓ కుమారుడు మంత్రి హరీశ్ రావు‌కు వాట్సాప్ సందేశం పంపాడు. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నంట యాదిరెడ్డి తల్లి పద్మ గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతోంది. అసలే పేదరికం పైగా లాక్‌డౌన్.. ఈ క్రమంలో తల్లి పడుతున్న బాధను వివరిస్తూ తమను ఆదుకోవాలంటూ మంత్రి హరీశ్‌రావుకు వాట్సాప్ సందేశాన్ని పంపాడు. స్పందించిన మంత్రి.. అమ్మకు ఏం కాదు.. అధైర్యపడొద్దు.. అండగా నేనుంటానని యాదిరెడ్డికి భరోసా ఇచ్చారు. మెరుగైన చికిత్స కోసం పద్మను హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం చికిత్సకు అవసరమైన రూ. 2 లక్షల రూపాయల ఎల్ఓసీ పత్రాన్ని యాదిరెడ్డికి మంత్రి హరీశ్ రావు అందజేశారు. అనంతరం రామునిపట్ల గ్రామంలోని చెక్ డ్యామ్‌కు పుష్పాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఏంపీపీ మాణిక్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News