డ్రై డేలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు
దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని గణేశ్ నగర్ లో డ్రై డేలో భాగంగా ఇంటింటా మంత్రి హరీష్ రావు కలియతిరిగారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నివాసంలో డ్రైడేలో భాగంగా.. ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటి నిల్వలను ప్రత్యక్షంగా ఇంటి కుటుంబీకులకు మంత్రి హరీశ్ చూపించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా.. మీ ఇంట్లో పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధుల వ్యాప్తి […]
దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని గణేశ్ నగర్ లో డ్రై డేలో భాగంగా ఇంటింటా మంత్రి హరీష్ రావు కలియతిరిగారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నివాసంలో డ్రైడేలో భాగంగా.. ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటి నిల్వలను ప్రత్యక్షంగా ఇంటి కుటుంబీకులకు మంత్రి హరీశ్ చూపించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా.. మీ ఇంట్లో పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధుల వ్యాప్తి చెందకుండా చూడాలని సూచించారు. డ్రై డే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని ప్రజలకు మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు.