మంత్రులతో హరీశ్ మంతనం.. దేనికి సంకేతం!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం కరీంనగర్ చుట్టూనే తిరుగుతున్నాయి. దానికి ముందు అసలేం జరిగింది. ట్రబుల్ షూటర్ జిల్లాలో సడన్ ఎంట్రీ ఎందుకు ఇచ్చారన్నదే ఇక్కడ హాట్ టాపిక్.. ఓ వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు మంత్రి హరీష్ రావు కరీంనగర్ వచ్చి వెళ్లారు. అయితే, జిల్లాకు చెందిన మంత్రులతో ఆయన సమావేశం కావడం పెద్ద చర్చకు దారి తీసింది. రాబోయే ఉపఎన్నిక కోసం ట్రబుల్ షూటర్ హరీష్ డైరెక్ట్‌గా రంగంలోకి దిగినట్టు ఈ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం కరీంనగర్ చుట్టూనే తిరుగుతున్నాయి. దానికి ముందు అసలేం జరిగింది. ట్రబుల్ షూటర్ జిల్లాలో సడన్ ఎంట్రీ ఎందుకు ఇచ్చారన్నదే ఇక్కడ హాట్ టాపిక్.. ఓ వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు మంత్రి హరీష్ రావు కరీంనగర్ వచ్చి వెళ్లారు. అయితే, జిల్లాకు చెందిన మంత్రులతో ఆయన సమావేశం కావడం పెద్ద చర్చకు దారి తీసింది. రాబోయే ఉపఎన్నిక కోసం ట్రబుల్ షూటర్ హరీష్ డైరెక్ట్‌గా రంగంలోకి దిగినట్టు ఈ టూర్ కన్ ఫర్మ్ చేస్తోంది.
ఆయన సడన్ వచ్చి సర్‌ప్రైజ్ ఇవ్వడం, వేడుకకు వచ్చి వెళ్లిపోకుండా జిల్లా మంత్రులతో సమావేశం కావడమే పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా మంత్రి హరీష్ వచ్చి వెళ్తే పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. కానీ, ఈటల రాజేందర్ రాజీనామా అస్త్రం ప్రయోగించిన రోజే కరీంనగర్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శామీర్ పేట్‌లో ఈటల ఘాటు వ్యాఖ్యల వెనక ఏం జరుగుతోందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. మంత్రులు గంగుల, కొప్పుల ప్రెస్‌మీట్‌కు ముందు అదే హోటళ్లో జరుగుతున్న పెళ్లికి హాజరుకావడం అక్కడ వీరంతా మీటింగ్ పెట్టుకోవడం వెనక ఆంతర్యం ఎంటనీ జిల్లాలో పెద్ద ఎత్తున్ చర్చ సాగుతోంది.