అప్పుడు రామాలయం… ఇప్పుడు వెంకటేశ్వరాలయం
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు మంత్రి తన్నీరు హరీష్‌రావు నగరంలోని జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్థిక మంత్రి హరీష్‌రావు గురువారం ఉదయం దర్శనం చేసుకున్న తర్వాత రాష్ట్ర 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టానికి బయల్దేరారు. మంత్రి హరీష్‌రావు 2020–21 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన రామాలయానికి వెళ్లి పూజలు చేశారు. కొండాపూర్ వసంత వ్యాలీ సమీపంలోని రామాలయానికి వెళ్లి పూజలు నిర్వహించిన అనంతరం […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు మంత్రి తన్నీరు హరీష్‌రావు నగరంలోని జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్థిక మంత్రి హరీష్‌రావు గురువారం ఉదయం దర్శనం చేసుకున్న తర్వాత రాష్ట్ర 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టానికి బయల్దేరారు. మంత్రి హరీష్‌రావు 2020–21 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన రామాలయానికి వెళ్లి పూజలు చేశారు. కొండాపూర్ వసంత వ్యాలీ సమీపంలోని రామాలయానికి వెళ్లి పూజలు నిర్వహించిన అనంతరం స్పీకర్ పోచారానికి బడ్జెట్ కాపీని అందించి ప్రవేశపెట్టారు. ఈసారి మాత్రం ఆలయాన్ని మార్చారు. కారణాలేమైనా… గతంలో శ్రీరామున్ని దర్శనం చేసుకుని… ఇప్పుడు మాత్రం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పూజలు చేసి అసెంబ్లీకి వచ్చి తొలి కాపీని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అందించారు.