అదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.. నిలోఫర్‌లో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో ఆధునీకరించిన వందపడకల ఐసీయూను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైసీయా, నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయమని హ‌రీష్ రావు అభినందించారు. నిలోఫర్ ఆసుపత్రిలో ప్రభుత్వం ప్రతీ పడకకూ […]

Update: 2021-11-13 07:23 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో ఆధునీకరించిన వందపడకల ఐసీయూను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైసీయా, నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయమని హ‌రీష్ రావు అభినందించారు. నిలోఫర్ ఆసుపత్రిలో ప్రభుత్వం ప్రతీ పడకకూ ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తోందన్నారు.

రాబోయే రోజుల్లో వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5 వేల పడకలు ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.133 కోట్లు విడుదల చేశారని మంత్రి హరీష్ రావు తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారిగా నిలోఫర్ ఆసుపత్రిని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. రూ.33 కోట్లతో నిలోఫర్‌లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు.

నగరానికి నాలుగు వైపులా నాలుగు మెడికల్ టవర్‌లు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రతీ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, నిలోఫర్ సూపరింటెండెంట్ మురళి కృష్ణ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హైసీయా ఎండీ భరణి, నిర్మాణ్, ఇన్ఫోసిస్, ఓపెన్ టెక్స్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిలోఫర్‌లో మరో 25 ఐసీయూ పడకలను రూ .1.75 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్, నిర్మాణ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Tags:    

Similar News