అభివృద్ధి పనుల పురోగతిపై హరీశ్ రావు సమీక్ష
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ రాజనర్సు అధ్యక్షతన పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ అధికారులతో మంత్రి హరీశ్ రావు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ రెవెన్యూ ఆదాయం పెంచే దిశగా అధికారులు ఆలోచన చేయాలన్నారు. పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి, పారిశుద్ధ్య, విద్యుత్ విభాగాల్లోని ఉద్యోగుల సేవలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటే సిద్దిపేట అద్దంలా తయారవుతుందని తెలిపారు. ఇందుకు తగిన […]
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ రాజనర్సు అధ్యక్షతన పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ అధికారులతో మంత్రి హరీశ్ రావు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ రెవెన్యూ ఆదాయం పెంచే దిశగా అధికారులు ఆలోచన చేయాలన్నారు. పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి, పారిశుద్ధ్య, విద్యుత్ విభాగాల్లోని ఉద్యోగుల సేవలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటే సిద్దిపేట అద్దంలా తయారవుతుందని తెలిపారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బందికి వంద పీపీఈ కిట్లను అందజేశారు. తర్వాత పట్టణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రైతు బజారును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ లక్ష్మణ్, ఇంజినీరింగ్ అధికారులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Tags : Minister Harish Rao, review meeting,Siddipet,development,works,muniple