అమ్మా పెట్టదు.. అడుక్కొనివ్వదు : కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ ఫైర్
దిశ సిద్దిపేట : వ్యాక్సినేషన్ విషయంలో అమ్మ పెట్టదు.. అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం ఉందనీ ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో హైరిస్క్ వ్యక్తులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం సిద్దిపేట బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఆర్థిక మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలతో పాటు తెలంగాణ వాసులు కూడా ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్రాలకు […]
దిశ సిద్దిపేట : వ్యాక్సినేషన్ విషయంలో అమ్మ పెట్టదు.. అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం ఉందనీ ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో హైరిస్క్ వ్యక్తులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం సిద్దిపేట బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఆర్థిక మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలతో పాటు తెలంగాణ వాసులు కూడా ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్రాలకు అవసరమైన వాక్సిన్‌లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని, కంపెనీలు ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకొనివ్వడం లేదనీ విమర్శించారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌లను కూడా కంపెనీల నుంచి మనం కొనుక్కునే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తూ.. రాష్ట్రాలను బద్నాం చేస్తుందని విమర్శించారు.
సకాలంలో వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యిందన్నారు. ఇప్పటికైనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రం తన తప్పుడు నిర్ణయాలపై పునసమీక్షించుకుని.. వ్యాక్సినేషన్ దిగుమతిని సరళతరం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్లను కంపెనీలు, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే అవకాశం కల్పించాన్నారు. కోవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.రాష్ట్రాలకు కేటాయించే వ్యాక్సిన్లు ఎన్ని ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల కంపెనీలు టీకాలను తెలంగాణకు ఇవ్వలేక పోతున్నాయన్నారు. ఇప్పటికే కరోనా కట్టడికి నిర్వహించిన ఇంటింట సర్వే మంచి ఫలితాలను ఇచ్చిందని, థర్ధ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఆ దిశగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.