ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి : హరీశ్ రావు

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొండా మల్లయ్య గార్డెన్స్‌లో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాలకు చెందిన 700 మంది ఆటో డ్రైవర్లకు, 162 మంది రజకులకు నిత్యావసర వస్తువుల కిట్స్‌ను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, రోడ్లపై ఉమ్మి వేయాకూడదని సూచించారు. లాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బంది నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తరఫున సరుకులు అందిస్తున్నామన్నారు. ప్రతి […]

Update: 2020-04-14 03:13 GMT

దిశ, మెదక్:
సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొండా మల్లయ్య గార్డెన్స్‌లో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాలకు చెందిన 700 మంది ఆటో డ్రైవర్లకు, 162 మంది రజకులకు నిత్యావసర వస్తువుల కిట్స్‌ను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, రోడ్లపై ఉమ్మి వేయాకూడదని సూచించారు. లాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బంది నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తరఫున సరుకులు అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు ఇస్తున్నామన్నారు. బ్యాంకులో డిపాజిట్ అయినా డబ్బులను సామాజిక దూరం పాటించి తీసుకోవాలని, బ్యాంకులో ఆగమాగం చేయకుండా అందరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

Tags: Minister Harish Rao, distributes, essential, goods, auto drivers, medak

Tags:    

Similar News