దేశానికి దశ, దిశ కేసీఆర్

దిశ, మెదక్: విపక్షాల తిట్లు తమకు దీవెనలనీ, అభివృద్ధి కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుని వెళ్తామని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ మున్సిపల్ కౌన్సిల్ లోని ఆయా వార్డులకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి టీఆర్ ఎస్ లోకి ఆయన ఆహ్వానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు కాలం చెల్లిందని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితులు […]

Update: 2020-10-04 04:44 GMT

దిశ, మెదక్:
విపక్షాల తిట్లు తమకు దీవెనలనీ, అభివృద్ధి కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుని వెళ్తామని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ మున్సిపల్ కౌన్సిల్ లోని ఆయా వార్డులకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి టీఆర్ ఎస్ లోకి ఆయన ఆహ్వానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు కాలం చెల్లిందని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. అందుకే ఆరెండు పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు టీఆర్ ఎస్ లో జాయిన్ అవుతున్నారని అన్నారు. ఆరెండు పార్టీలు కలిసినా దుబ్బాక ఉప ఎన్నికల్లో వారికి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ ఠాకూర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పేదానికి రాష్ట్రంలో ఆపార్టీ నాయకులు చేస్తున్నదానికి పొంతనే లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కొట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని విమర్శించారు . దేశానికి దశ, దిశ చూపిస్తున్న కేసీఆర్ పై విపక్షాల ఆరోపణలు సరికావన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశ పెడితే బీజేపీని ప్రశ్నించని కాంగ్రెస్ నాయకులు టీఆర్ ఎస్ మీద ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.

Tags:    

Similar News