చికెనా.. మటనా.. మహిళలతో హరీశ్‌రావు

దిశ, మెదక్: ఆదివారం కదా ఎం తెచ్చుకున్నారు? మటనా.. చికెనా..? ఏది తెచ్చినా టిఫిన్ బాక్స్‌లోనే తెచ్చుకోవాలి అంటూ మహిళలతో మంత్రి హరీష్ రావు ముచ్చటించారు. సిద్దిపేటలోని 13వార్డులో స్టీల్ బ్యాంక్ ఓపెన్ చేసిన అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న మహిళలను చూసి కారు ఆపి వారితో కాసేపు సంభాషించారు. ‘ఈరోజు ఆదివారం కదా ఎం తెచ్చుకున్నారు? చికెనా.. మటన్ తెచ్చుకున్నారా? మరి చికెనైనా.. మటన్ అయినా టిఫిన్ బాక్స్‌లోనే తెచ్చుకోవాలి. మార్కెట్‌కు […]

Update: 2020-06-07 07:04 GMT

దిశ, మెదక్: ఆదివారం కదా ఎం తెచ్చుకున్నారు? మటనా.. చికెనా..? ఏది తెచ్చినా టిఫిన్ బాక్స్‌లోనే తెచ్చుకోవాలి అంటూ మహిళలతో మంత్రి హరీష్ రావు ముచ్చటించారు. సిద్దిపేటలోని 13వార్డులో స్టీల్ బ్యాంక్ ఓపెన్ చేసిన అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న మహిళలను చూసి కారు ఆపి వారితో కాసేపు సంభాషించారు. ‘ఈరోజు ఆదివారం కదా ఎం తెచ్చుకున్నారు? చికెనా.. మటన్ తెచ్చుకున్నారా? మరి చికెనైనా.. మటన్ అయినా టిఫిన్ బాక్స్‌లోనే తెచ్చుకోవాలి. మార్కెట్‌కు పోతే నాన్‌వెజ్ అయితే టిఫిన్.. వెజ్ కోసమైతే బట్ట సంచి తెచ్చుకోవాలి. ప్లాస్టిక్ బంద్ చేయాలి. అన్ని రోగాలు వస్తున్నాయి’. అంటూ మంత్రి కాసేపు మహిళలతో ముచ్చటించారు. మీరు చేపినట్టే చేస్తాం సార్. మాకోసం మీరు చెపుతున్నారు.. తప్పకుండా పాటిస్తామని మహిళలు మంత్రితో అన్నారు.

Tags:    

Similar News