సెకండ్ వేవ్ ప్రమాదం ఉంది.. టెస్టులు పెంచండి : హరీశ్ రావు

దిశ, సిద్దిపేట: వచ్చే రెండు వారాల్లో 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కోవిడ్ వాక్సినేషన్ తీసుకోనేలా చూడాలనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వాక్సినేషన్ కార్యక్రమం అమలు తీరు, సెకెండ్ వేవ్‌పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో హరీశ్ రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సిద్దిపేట జిల్లాలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉందన్నారు. జిల్లాలో ప్రస్తుతం […]

Update: 2021-04-12 06:28 GMT

దిశ, సిద్దిపేట: వచ్చే రెండు వారాల్లో 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కోవిడ్ వాక్సినేషన్ తీసుకోనేలా చూడాలనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వాక్సినేషన్ కార్యక్రమం అమలు తీరు, సెకెండ్ వేవ్‌పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో హరీశ్ రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సిద్దిపేట జిల్లాలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1410 పాజిటివ్‌ కేసులు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రజలను అప్రమత్తం చేయకపోతే మరింతగా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వైద్య కళాశాల, RVM, సురభి వైద్య కళాశాల లో 250 కోవిడ్ పడకల ఆసుపత్రిని సిద్ధం చేయాలన్నారు. కొవిద్ వార్డులో వైద్యులు, సిబ్బంది అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందేలా చూడాలని అన్నారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం చేస్తున్న ఆర్టీపీసీఆర్, రాపిడ్ పరీక్షలు సరిపోవని, టెస్టులను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రోజుకు కనీసం 5000 రాపిడ్ టెస్ట్‌లు చేయాలని అధికారులకు సూచించారు.

స్థానిక సంస్థల క్షేత్ర ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది టీకా తీసుకునేలా చూడాల్సిన బాధ్యత అదనపు కలెక్టర్ మూజమ్మిల్ ఖాన్ దే అని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జిల్లాలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రైతు సమన్వయ సమితి సభ్యులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మొత్తం 3500 మందితో సెకండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలన్నారు.

వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణలకు సమావేశంలో నుంచే మంత్రి హరీశ్ రావు ఫోన్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్టులు, రాపిడ్ టెస్టులు సంఖ్య పెంచేందుకు సహకరించాలని కోరారు. అలాగే వ్యాక్సినేషన్ 100 శాతం లక్ష్యం పూర్తి చేసేందుకు అవసరమైన డోస్‌లను పంపించాలని మంత్రి కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పూర్తి సహాకారం అందిస్తే వచ్చే వారం రోజుల్లో సిద్దిపేట జిల్లాను వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రథమ స్థానంలో నిలుపుతామని మంత్రి తెలిపారుమంత్రి విజ్ఞప్తికి స్పందించిన ఇరువురు సానుకూలంగా స్పందించారు.

మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా : సీపీ

ఇక నుంచి బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించాల్సిందేనని సీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. మాస్క్‌ ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జరిమానాతో పాటు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌యాక్ట్‌-2005, ఐపీసీ సెక్షన్‌ 188, 51- 60 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News