కరోనా ఇప్పట్లో పోదు : ఈటల
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మండలిలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్తలతో కరోనా మరణాలను తగ్గించామని తెలిపారు. కరోనా కాంటాక్ట్ ట్రెసింగ్‌లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందని ఆయన వివరించారు. అయితే, కరోనా మహమ్మారి ఇప్పట్లో పోదని.. కావున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలని మంత్రి సూచించారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా బారిన పడిన […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మండలిలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్తలతో కరోనా మరణాలను తగ్గించామని తెలిపారు. కరోనా కాంటాక్ట్ ట్రెసింగ్‌లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందని ఆయన వివరించారు.
అయితే, కరోనా మహమ్మారి ఇప్పట్లో పోదని.. కావున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలని మంత్రి సూచించారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా బారిన పడిన వారిని రక్షించేందుకు డాక్టర్ రాజారావు, ప్రభాకర్ రెడ్డి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని, వైద్య సిబ్బంది సేవలు కూడా బాగున్నాయని ఈటల కితాబిచ్చారు.
Read Also..