వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత: ఈటల
దిశ, వరంగల్: తెలంగాణలో మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికే అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సాయంత్రం హన్మకొండలోని సీఎస్‌ఆర్ గార్డెన్‌లో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోయర్ మానేర్ డ్యామ్ నుంచి నీటి విడుదల అంశంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంట కాలువలను దేవాలయాలుగా భావించాలన్నారు. కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడు కాలువల ద్వారా వచ్చే నీటిని పర్యవేక్షించాలని ఆయన సూచించారు. అలాగే, వంద శాతం కాలువల నీరు చివరి భూమి, చివరి […]
దిశ, వరంగల్: తెలంగాణలో మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికే అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సాయంత్రం హన్మకొండలోని సీఎస్‌ఆర్ గార్డెన్‌లో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోయర్ మానేర్ డ్యామ్ నుంచి నీటి విడుదల అంశంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంట కాలువలను దేవాలయాలుగా భావించాలన్నారు. కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడు కాలువల ద్వారా వచ్చే నీటిని పర్యవేక్షించాలని ఆయన సూచించారు. అలాగే, వంద శాతం కాలువల నీరు చివరి భూమి, చివరి పంట వరకు అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.