ఫ్లైట్స్, రైళ్లు ఆపాలన్నది కేసీఆరే : ఈటల
దిశ, వెబ్‌డెస్క్: వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామని అన్నారు. ఇప్పటికీ అనేక రాష్ట్రాలు సెకండ్ వేవ్‌తో బాధపడుతున్నాయని వెల్లడించారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని అన్నారు. వైరస్ విస్తృతవ్యాప్తిని గుర్తించి మొదట రైళ్లు, ఫ్లైట్స్ ఆపాలని చెప్పింది కేసీఆరే అని గుర్తుచేశారు. అంతేగాకుండా దేశంలో మొదట లాక్‌డౌన్ విధించి, ఆదర్శంగా నిలిచింది కూడా […]
దిశ, వెబ్‌డెస్క్: వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామని అన్నారు. ఇప్పటికీ అనేక రాష్ట్రాలు సెకండ్ వేవ్‌తో బాధపడుతున్నాయని వెల్లడించారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని అన్నారు. వైరస్ విస్తృతవ్యాప్తిని గుర్తించి మొదట రైళ్లు, ఫ్లైట్స్ ఆపాలని చెప్పింది కేసీఆరే అని గుర్తుచేశారు. అంతేగాకుండా దేశంలో మొదట లాక్‌డౌన్ విధించి, ఆదర్శంగా నిలిచింది కూడా తెలంగాణే అన్నారు. ప్రస్తుతం అందరికీ వ్యాక్సిన్ అందించే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. వందలసంఖ్యలో వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.